తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే పిల్లల ఆస్తి హక్కు రద్దు అవుతుందా? తల్లిదండ్రుల పేరు మీద ఉన్న ఆస్తిని పిల్లలకు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత తిరిగి దానిని రద్దు చేసే అవకాశం ఉంటుందా? ఈ అంశానికి సంబంధించి సుప్రంకోర్టు 2025 జనవరి 4న ఒక సంచలనాత్మకమైన తీర్పును ఇచ్చింది. ఆ తీర్పు ఏమని ఇచ్చింది? తీర్పు ముఖ్య ఉద్దేశం ఏమిటి? అసలు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే పిల్లలు ఎలాంటి హక్కులు కోల్పోతారు లాంటి అనేక అంశాలు తెలుసుకుందాం.
వివరాల్లోకి వెళ్తే.. పిల్లలు తమ తల్లిదండ్రుల పోషణ విషయంలో నిర్లక్ష్యం చేస్తే వారికి రాసిచ్చిన అన్ని రకాల ఆస్తి హక్కులను రద్దు చేయవచ్చని సుప్రీం కోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పును ఇచ్చింది. నిజంగా ఈ తీర్పు భారత న్యాయవ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తిని వారసత్వంగా ఇవ్వడం సాధారణం.
కానీ ఆస్తి చేజిక్కించుకున్న తర్వాత చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలా నిర్లక్ష్యానికి గురైన వారి చేతిలో ఆస్తి లేక, తమను పట్టించుకునే వారులేక వృద్దాప్యంలో ఉన్న ఎంతో మంది తల్లిదండ్రులు జీవితం చివరి దశలో ఎవరికి చెప్పుకోలేక, ఎవరి సహాయం అర్జించలేక అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. ఇలా ఆస్తి చేజిక్కించుకుని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసేవారికి నిజంగా ఈ తీర్పు ఒక చెంప పెట్టు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పును భారతీయులుగా మనమందరం స్వీకరించాల్సిందే.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే పిల్లల ఆస్తి హక్కు రద్దు అవుతుందనీ 2007లో తీసుకొచ్చిన ‘తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం’ ప్రకారం 2025 జనవరి 4న సుప్రీంకోర్టు జస్టిస్ సి.టి.రవికుమార్ మరియు జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే పిల్లల ఆస్తి హక్కు రద్దు అవుతుందనీ సంచలనాత్మకమైన తీర్పును ఇచ్చారు. ఇంకా ట్రైబ్యునళ్లు తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లల విషయంలో సత్వర విచారణ జరిపి, ఆస్తి హక్కులను తిరిగి తల్లిదండ్రులకు ఇప్పించాలని ధర్మాసనం తెలిపింది. ఈ తీర్పు ప్రకారం, తల్లిదండ్రులు తమ పిల్లలు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని నిరూపించగలిగితే, ఆస్తి హక్కు రద్దు చేయవచ్చు. ఇది తల్లిదండ్రులకు ఒక రక్షణగా ఉంటుంది.
ఈ కేసు ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు ఆస్తి హక్కు రద్దు చేయడం ద్వారా వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించడం. ఈ కేసు తొలుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తార్‌పుర్‌కు చెందిన ఓ వృద్ధ మహిళ తన కుమారుడిపై నమోదు చేసింది. ఆమె తన కుమారుడికి కొంత ఆస్తిని గిఫ్ట్ డీడ్ రూపంలో రాసిచ్చింది. కానీ, ఆ కుమారుడు తల్లిదండ్రులను పట్టించుకోకుండా, మిగిలిన ఆస్తిని కూడా తనకు ఇవ్వాలని కోరుతూ వారిపై తరచూ దాడి చేసేవాడు.
ఈ పరిస్థితుల్లో ఆ వృద్ధ మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తన కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి ఆ ఆస్తిపై తన హక్కును పునరుద్ధరించాలని కోరింది. ఈ కేసును విచారించిన సబ్‌డివిజనల్ మేజిస్ట్రేట్ కోర్టు గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసి ఆ ఆస్తిని ఆ వృద్ధ మహిళకు కేటాయిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం కూడా స్వాగతించి సమర్థించింది. కానీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును కొట్టివేసి ఆస్తి కుమారుడికే దక్కుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో బాధిత మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు జస్టిస్ సి.టి.రవికుమార్ మరియు జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం వృద్ధ దంపతుల హక్కులను పునరుద్ధరించి కుమారుడికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేసింది.
నిజంగా ఈ తీర్పు భారతీయ న్యాయ వ్యవస్థలో ఒక చారత్రాత్మక తీర్పు అని చెప్పాలి. ఈ తీర్పు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు ఒక చెంప పెట్టు అని చెప్పాలి. ఈ తీర్పు జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధ తల్లితండ్రులకు ఆర్థిక భరోసా కలిగిస్తుందని చెప్పాలి. ఆస్తి హక్కు రద్దు చేయడం ద్వారా పిల్లలు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా, బాధ్యతగా వ్యవహరించాలని సూచించే ఈ తీర్పును భారతీయులుగా మనమందరం గౌరవిద్దాం.. స్వీకరిద్దాం. ఈ తీర్పు ద్వారా ముఖ్యంగా వయోధికులైన తల్లిదండ్రులకు ఆర్థికపరమైన భరోసా లభిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించడానికి ఈ తీర్పు సహాయపడుతుంది.
మొత్తానికి ఈ తీర్పు తల్లిదండ్రులకు ఒక రక్షణగా, పిల్లలకు ఒక బాధ్యతగా ఉంటుంది. ఈ తీర్పు భారత న్యాయవ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయి. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఆధారపడకుండా, స్వతంత్రంగా జీవించడానికి ఈ తీర్పు సహాయపడుతుంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన పిల్లలు ఆస్తి హక్కులను కోల్పోవడంతో పాటు, తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై, అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సమాచారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్ స్క్రయిబ్ చేయండి.
https://youtu.be/vQntqxSWYcA?si=-WaPizU3TpW0nUDm
#వేణు_పెరుమాళ్ల ✍🏼
#ParentalNeglect
#PropertyRights
#IndianJudiciary
#JusticeRavikumar
#JusticeSanjayKarol
#LandmarkJudgment
#ParentalProtection
#InheritanceLaw
#FamilyResponsibility
#LegalPrecedent
#ElderCare
#PropertyRevocation
#ParentalRights
#JudicialDecision
#FamilyLaw
#ChildrenResponsibility
#LegalRights
#IndependentLiving
#ParentalSupport
#IndianLaw
0 Comments