Ticker

10/recent/ticker-posts

44 ఏళ్ల నిరీక్షణ.. చివరకు శవమై వచ్చిన భర్త.. రూపాయి పంపకపోయినా అత్తమామలను సాకిన కోడలు.

11 జులై2026, సౌదీ అరేబియా: ప్రస్తుత సమాజంలో చిన్న మాటకే విడిపోతున్న భార్యభర్తలకు ఆమె జీవితం ఆదర్శం. పెళ్లైనా ఏడాదికే ఉపాధి కోసం భర్త ఎడాది దేశం బాట పట్టాడు. తిరిగి రాలేదు. మనువాడిన వాడి కోసం ఏళ్లు ఎదురు చూసింది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 44ఏళ్ల పాటు కళ్లలో ఒత్తులు వేసుకుని చూసింది. గల్ఫ్ నుంచి ఎవరు వచ్చిన తన భర్త గురించి ఆరా తీసేది. చివరకు భర్త అక్కడే కన్ను మూశాడు. మృతదేహాన్ని తీసుకొచ్చి బాధ్యతతో దహన సంస్కరాలు చేసింది. కన్నీరు పెట్టిస్తున్న తెలంగాణ వాసి దీనగాథ ఇది.

https://www.managulfnews.com/
Telagana-Gulf-worker-dead-44years

Who is chandraiah: అసలు ఎవరీ చంద్రయ్య

చంద్రయ్యది సిద్దిపేట (Siddipeta)జిల్లా దుబ్బాక మండలం చల్లాపూర్ గ్రామం. 1981లో అదే గ్రామానికి చెందిన లక్ష్మితో పెళ్లి అయింది. దాని నుంచి బయటపడడానికి 44 ఏళ్ల క్రితం ఎడారి దేశం బాట పట్టాడు. 1982లో సౌదీ అరేబియాకు వెళ్లి, ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి రాలేదు. ఎన్నో ఆశలతో అత్తింటికి వెళ్లిన లక్ష్మి భర్త.. కుటుంబం కోసం అరబ్బు దేశం ఫ్లైట్ ఎక్కినా ఆమె భయపడలేదు. అప్పటి నుంచి ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉంది. అరబ్బు దేశానికి వెళ్లిన తన భర్త వస్తాడని 44 ఏళ్లు ఎదురు చూసింది. 20ఏళ్ల తన గ్రామానికి చెందిన ఒక వ్యక్తి.. సౌదీలో తన భర్తను కలిసాడని తెలుసుకుని ఆనందపడింది. ఏదో ఒక రోజు వస్తాడని ఆశపడిన ఆమెకు కన్నీరే మిగిలింది. గతంలో  అత్తమామలు అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు లక్ష్మి విధేయత కలిగిన కోడలిగా కాకుండా కన్నబిడ్డలా వారికి సేవలందించింది. వారిని తల్లిదండ్రులుగా భావించి ఆలనా పాలనా చూసుకుంది. ఇప్పుడు శవమై రావడంతో కన్నీటి పర్యాంతం అవుతోంది. 


How did they bring it: ఎలా తీసుకోచ్చారు

చంద్రయ్య చనిపోయిన విషయం తెలియగానే లక్ష్మి తల్లడిల్లింది. భర్త కోసం 44 ఏళ్లు ఎదురుచూసిన ఆమె చివరకు అలిసి పోయింది. ఏనాడు రూపాయి పంపించకపోయినా.. తన అత్తమామలను చూసుకునేందుకు కూలీనాలీ చేసుకుంటూ పూట గడిపింది. చివరకు భర్త శవాన్ని తీసుకొచ్చేందుకు ఆమె దగ్గర డబ్బులు లేకపోవడంతో... గ్రామస్తులు, ప్రభుత్వం కలిసి తలో చేయి వేసి చంద్రయ్య అంత్యక్రియలు చేశారు. 

Why couldn't come?: చంద్రయ్య ఎందుకు రాలేకపోయాడు

పెళ్లయిన ఏడాదికే ఎడారి బాట పట్టిన చంద్రయ్య వెనక్కి రాలేదు. అరబ్బు దేశంలో 44 ఏళ్లు గడిపాడు. అయితే.. ఆయన వెళ్లిన సమయంలో పాస్ పోర్టు (Passport) ఒక్కటే ఉంది. ఆ తర్వాత దేశంలో అనేక మార్పులు వచ్చాయి. ఆయనకున్న ఏకైక ఓటరు కార్డు(voter card) మారింది. ఒక్కసారి భారతదేశానికి రాకపోవడం ఓటు వేయకపోవడంతో అదీ పోయింది. దాంతో పాటు కొత్తగా అమల్లోకి వచ్చిన ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు(adhar card) కొత్త గుర్తింపు విధానాలతో అతడు భారతీయుడిగా (Indian) నమోదు కాలేదు. దాంతో ఎప్పుడో ముగిసిన చంద్రయ్య వీసా రెన్యువల్ (visa renewal) కాలేకపోయింది. దాంతో అక్కడే ఉండిపోయాడు. మరణించిన తర్వాత మృతదేహాన్ని ఎవరూ తీసుకెళ్లకపోవడంతో విచారణ చేపట్టి పాస్ పోర్ట్ ఆధారంగా ఉన్న వీసా వివరాలతో అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

చంద్రయ్య పని చేస్తున్న కంపెనీతో వివాదం ఏర్పడింది. దాంతో అందులో చిక్కుకున్నాడు. దానికి తోడు ఆయనకు ఆధార్ లేకపోవడంతో పాస్ పోర్ట్ రెన్యూవల్ కాలేదు. దాంతో దాన్ని గడువు ముగిసింది. సమయం అయిపోవడంతో సౌదీ అఖమా రెన్యూవల్ కాలేదు. దీనికి తోడు ఆర్థిక సమస్యలు, (Economic crisis) ఉపాధి ఆరాటం కారణాలతో చాలా ఏళ్ల పాటు కూలీనాలీ పని చేసుకుంటూ కాలం గడిపాడు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో మే నెలలో మరణించాడు. చంద్రయ్య చనిపోయి చాలా రోజులు అవుతున్నా.. శవం గురించి ఎవరూ విచారించకపోవడంతో ఆస్పత్రి వర్గాలు, పోలీసులు చంద్రయ్య వీసా ఆధారంగా అతను భారతీయుడని గుర్తించి.. ఎంబసీకి సమాచారం అందించారు. భారతీయ ఎంబసీ సహాయంతో మృతుడి కుటుంబ వివరాలను తెలుసుకొని వారిని సంప్రందించారు. 

Why did this situation arise: ఎందుకీ పరిస్థితి ఏర్పడింది..?

ఇప్పుడంటే హైటెక్ హంగులు వచ్చాయి. కానీ, ఒకప్పుడు తెలంగాణలో (Telanganana)కరువు ఉండేది. చేసేందుకు ఉపాధి లేకపోయేది. కుటుంబం గడవడం కోసం బొంబాయి, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లేవారు. అక్కడ దొరికిన పని చేస్తూ కుటుంబాన్ని సాకేవారు. ఏడాదికి, రెండేళ్లకు ఒకసారి భార్యపిల్లలను, తల్లిదండ్రులను చూసి వెళ్లేవారు. అలానే చంద్రయ్య కూడా వెళ్లాడు. కొన్నాళ్లు పని చేశాడు. అప్పుడప్పుడు ఉత్తరాలు(Letters) రాసేవాడు చంద్రయ్య. కానీ, ఆ తర్వాత అవి కూడా మాయం అయ్యాయి. ఉత్తరాలు పోయి ఫోన్లు (basic phone) వచ్చినా, స్మార్ట్ ఫోన్లు (Smartphone) వచ్చినా ఆయన నుంచి ఎలాంటి సమాచారం లేకపోయింది. అయినా సరే ఆమె ఎదురు చూస్తూనే ఉంది. ఎప్పుడో ఒకప్పుడు రాకపోతాడా అని.. 

ప్రభుత్వాలు ఏం చేయాలి..?

ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు(Gulf countries) వెళ్లి.. వీసా(visa) గడువు, దుర్భర జీవితం అనుభవిస్తున్న వారి వివరాలు తెలుసుకుని.. ఆయా దేశాలను సంప్రదించి స్వదేశానికి తీసుకురావాలని పలువురు సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. చంద్రయ్య లాంటి దీనగాథలపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్‌ లో మరణించిన వారికి అందిస్తున్నట్లుగా ప్రకటించిన అయిదు లక్షల రూపాయాల ఆర్ధిక సహాయం ఎడారి దేశాలలోని పేదలకు ఎండమావులుగా మిగులుతోందని.. దానిని పక్కగా అమలు అయ్యేలా చూడాలని ఇంకొంతమంది కోరుతున్నారు. 

సమస్య తీవ్రత:

విదేశాలలో పనిచేస్తున్న భారతీయ కార్మికుల భద్రత, వారి కుటుంబాల సంక్షేమంపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. వారి వివరాలను నమోదు చేసుకోవడం, క్రమం తప్పకుండా పర్యవేక్షించడం, ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే సహాయం అందించడం వంటి చర్యలు తీసుకోవాలి. అలాగే, విదేశాలకు వెళ్లే కార్మికులకు అవసరమైన అవగాహన కల్పించడం, వారి హక్కుల గురించి తెలియజేయడం కూడా  ముఖ్యం. 

End కొసమెరుపు:

ప్రస్తుత సమాజంలో భర్తలను భార్యలు.. భార్యలను భర్తలను హత్యలు చేస్తున్న కాలంలో లక్ష్మి ఆదర్శంగా నిలుస్తోంది. పవిత్రమైన దాంపత్య జీవితానికి నిలువెల్లుగా నిదర్శంగా నిలుస్తోంది. చిన్న కారణాలతోనే విడిపోతున్న ఈ హైటెక్ యుగంలో ఈమెను ఒక రోల్ మోడల్ గా తీసుకోవాలని అంటున్నారు.

Keywords

Telangana gulf, telangana gulf worker, NRI, Indian Embassy, Saudi authorities, Gulf worker, Muscat, wife awaiting, Migrant workers die, indian, NRI INDIAN, Saudi Embassy, Indian Embassy, Siddipeta, Chandraiah, Laxmi, 44 years waitin, role model lady, Role model women, Villegers help, home returns, emotional story, managulfnews, mana gulf news, telugu gulf news, managulfnews in telugu, మన గల్ఫ్ న్యూస్, మన గల్ఫ్ న్యూస్ తెలుగు వార్తలు, మన గల్ఫ్ న్యూస్ జాబ్స్, గల్ఫ్ సమాచారం తెలుగులో

Post a Comment

0 Comments

👉 "ఈ ప్రేమ కథ చివర చూసే వరకు skip చేయకండి…"