రీసెంట్ గా పటియాలా కోర్టు ఇచ్చిన ఒక తీర్పు వందల ప్రశ్నలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ తీర్పుతో సమాజానికి ఎటువంటి సందేశం ఇస్తుందో తెలియదు కానీ, ఇప్పటికే బ్రష్టుపట్టిపోయిన ఈ అనాగరిక సమాజం మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని సూచిస్తోంది. తాజాగా భార్య తన ప్రియుడితో హోటల్లో ఉండే హక్కు ఉందని పటియాలా హౌస్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు దేనికి సంకేతం ? ఆల్రెడీ శీలం, క్యారెక్టర్ వంటి పదాలకు అర్థమే లేకుండా పోయిన ఈ రోజుల్లో ఈ తీర్పుతో సమాజానికి ఎటువంటి సందేశం వెళ్తుంది? తప్పు చేస్తే శిక్షించవలసిన కోర్టులో పరోక్షంగా తప్పు చేసిన ఏమికాదంటే.. ఇంకా ఈ సమాజాన్ని మార్చే దిక్కెవరు? ఈ తీర్పుకు సంబడించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. |
Patiala House Court |
తీర్పు ఉద్దేశం ఏమిటి ?
తీర్పు సారాంశం ఏమిటంటే ఒక ఆర్మీ మేజర్ తన భార్య జూనియర్ అధికారితో వివాహేతర సంబంధం పెట్టుకుని, హోటల్‌లో గడిపినట్లు ఆరోపిస్తూ, విడాకుల కోసం పాటియాలా హౌస్ కోర్టును ఆశ్రయించారు. ఆయన హోటల్ సీసీటీవీ ఫుటేజ్‌ను ఆధారంగా చూపాలని కోరగా, కోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించింది. "ఒక వ్యక్తి మరొక వ్యక్తి భార్యను తీసుకెళ్లాడనేది పాత ఆలోచన" అని, సీసీటీవీ ఫుటేజ్ కోరడం వ్యక్తుల గోప్యతను ఉల్లంఘించడమని కోర్టు స్పష్టం చేసింది. వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యత ఇచ్చిన పాటియాలా హౌస్ కోర్టు భార్య తన ప్రియుడితో ఉండే హక్కు ఉందని స్పష్టం చేసింది.
అనేక ప్రశ్నలను లేవనెత్తిన తీర్పు
ఈ తీర్పు వ్యక్తిగత గోప్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, వివాహేతర సంబంధాలను నేరుగా సమర్థించకపోయినా, వ్యక్తుల స్వేచ్ఛను కాపాడే దిశగా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. హోటల్‌లో ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండటం వారి గోప్యతా హక్కు పరిధిలోకి వస్తుందని, దానిని విడాకులకు ఆధారంగా చేయడం సరికాదని కోర్టు సూచించింది. ఈ తీర్పు సుప్రీం కోర్టు గతంలో (2017) గోప్యతను ప్రాథమిక హక్కుగా పేర్కొన్న తీర్పును పరోక్షంగా ప్రతిబింబిస్తుంది. ఈ వ్యాఖ్యలు సమాజంలో వివాదాస్పద చర్చను రేకెత్తించాయి. ఒకవైపు వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడే ఈ తీర్పు, మరోవైపు వైవాహిక విశ్వాసం, నీతి విలువలపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇప్పటికే సమాజం హీనస్థితికి దిగజారడానికి ఇటువంటి తీర్పులే ఊతమిస్తున్నాయి. ప్రస్తుత అనాగరిక సమాజంలో శీలం క్యారెక్టర్ అనే పదాలకు అర్థమే లేకుండా పోయింది. ఇంకా పరిస్థితి ఎంతగా దిగజారిందంటే పి.జి.హాస్టళ్ళ ముందు 'co-living facility is available' అని బోర్డులు పెట్టుకునేంతగా తయారయింది ఈ సమాజం.
కోర్టు ఇచ్చిన ఒక తీర్పు
ఇటీవల ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఈ చర్చకు మరింత ఊతం ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం, ఒక ఆర్మీ మేజర్ తన భార్య జూనియర్ అధికారితో వివాహేతర సంబంధం పెట్టుకుని, హోటల్‌లో గడిపినట్లు ఆరోపించి, ఆ సంబంధానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను కోర్టులో కోరాడు. అయితే, కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ, హోటల్ ఫుటేజ్ కోరడం గోప్యతకు భంగం కలిగించే చర్య అని, వ్యక్తుల స్వేచ్ఛను హరించే ఆలోచనలు పాతబడినవని స్పష్టం చేసింది. ఈ తీర్పు సుప్రీం కోర్టు గతంలో వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించకూడదని చెప్పిన వ్యాఖ్యలను పరోక్షంగా సమర్థించింది.
స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడి జీవనశైలి
ఈ తీర్పు సమాజంలో ఒక కొత్త ధోరణిని సూచిస్తోంది. పరస్పర అంగీకారంతో జరిగే సంబంధాలను, డబ్బు ప్రమేయం లేనంత వరకు, నేరంగా చూడకూడదని కోర్టు తీర్పు సారాంశం. ఈ నేపథ్యంలో, సమాజంలో యువతీ యువకులు స్వేచ్ఛ పేరుతో విచ్చలవిడి జీవనశైలిని అవలంబిస్తున్నారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ తీర్పు వ్యక్తిగత గోప్యతను, స్వేచ్ఛను కాపాడేందుకు ఉద్దేశించినప్పటికీ, ఇది నైతిక విలువల క్షీణతకు దారితీస్తుందని విమర్శకులు అంటున్నారు.
ప్రశ్నార్థకం చేస్తోన్న సంబందాలు
సమాజంలో ఈ ధోరణి కొత్త కాదు. గత కొన్ని సంవత్సరాలుగా, పెద్ద నగరాల్లో ‘కో-లివింగ్’ సదుపాయాలు, హాస్టళ్ళు, హోటళ్ళు ఈ రకమైన జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాయి. ‘కో-లివింగ్ ఫెసిలిటీ’ అనే బోర్డులు హాస్టళ్ళ ముందు కనిపిస్తున్నాయి, ఇవి ఆడా-మగా కలిసి ఉండే సౌకర్యాన్ని సూచిస్తున్నాయి. ఇలాంటి సదుపాయాలు యువతలో సహజీవన సంబంధాలను సాధారణీకరిస్తున్నాయి. ఇష్టమొచ్చినంత కాలం కలిసి ఉండి, ఆ తర్వాత విడిపోయి మరొకరితో సంబంధం పెట్టుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారింది. ఇది సమాజంలో శీలం, నీతి వంటి సంప్రదాయ విలువలను ప్రశ్నార్థకం చేస్తోంది.
గోప్యతను కాపాడటం అంటే ఇదేనా ?
హోటళ్ళు కూడా ఈ ధోరణికి తోడ్పడుతున్నాయి. పెద్ద హోటళ్ళు గంటల లెక్కన రూములు ఇవ్వడం, పోలీసులు రెయిడ్‌లు ఆపేయడం వంటివి ఈ స్వేచ్ఛను మరింత పెంచుతున్నాయి. సుప్రీం కోర్టు గతంలో వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా పేర్కొన్న తీర్పు (2017) ఈ సందర్భంలో కీలకమైనది. పరస్పర అంగీకారంతో జరిగే సంబంధాలను నిషేధించడం గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, పోలీసులు హోటళ్ళపై రెయిడ్‌లు నిర్వహించడం గోప్యతకు భంగం కలిగించే చర్యగా పరిగణించబడుతోంది.
యువతపై తీవ్ర ప్రభావం
ఈ తీర్పు యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్వేచ్ఛ పేరుతో, బాధ్యత లేని జీవనశైలి పెరుగుతోంది. యువతీ యువకులు శారీరక సుఖాలను అనుభవించిన తర్వాత, అమాయకంగా పెళ్ళి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. ఇది వైవాహిక బంధాలలో విశ్వాసం, నీతిని దెబ్బతీస్తోంది. సుప్రీం కోర్టు వివాహ బంధం పరస్పర విశ్వాసంపై ఆధారపడి ఉంటుందని చెప్పినప్పటికీ, ఈ తీర్పు ఆ విశ్వాసాన్ని ప్రశ్నిస్తోందని విమర్శలు వస్తున్నాయి.
నీతి విలువలు ఎక్కడ ?
ఈ తీర్పు ఒక వైపు వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుతుంది, మరోవైపు సామాజిక నీతి విలువలను బలహీనపరుస్తుందని విమర్శకులు అంటున్నారు. సమాజంలో ఈ ధోరణులు కొనసాగితే, వైవాహిక సంబంధాలు, కుటుంబ వ్యవస్థలు బలహీనమయ్యే ప్రమాదం ఉంది. యువత స్వేచ్ఛను సమతుల్యంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నీతి, శీలం వంటి విలువలను కాపాడుకుంటూనే వ్యక్తిగత స్వేచ్ఛను ఆస్వాదించడం సమాజం ఎదుర్కొన్న సవాలు.
చివరిగా ఈ తీర్పు భారతీయ న్యాయ వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది. ఇది వ్యక్తిగత గోప్యత, ఆధునిక సంబంధాలు , వివాహ చట్టాలపై విస్తృతమైన చర్చకు దారితీస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ తీర్పుపై తదుపరి అప్పీళ్లు, ఉన్నత న్యాయస్థానాల నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి.
Keywords: Patiala House Court, privacy rights, extramarital affairs, Supreme Court, personal freedom, societal values, marriage laws, youth culture, moral debate, Indian judiciary, వ్యక్తిగత గోప్యత, వివాహేతర సంబంధాలు, సుప్రీం కోర్టు, సామాజిక విలువలు, వివాహ చట్టాలు, యువత జీవనశైలి, నైతిక చర్చ, భారతీయ న్యాయ వ్యవస్థ, స్వేచ్ఛ, కో-లివింగ్
0 Comments