Ticker

10/recent/ticker-posts

Ad Code

ISC సోహార్‌ ఆద్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు

15 ఆగస్టు 2025, సోహార్, ఒమన్: ఒమన్లోని సోహార్ లో నివసిస్తున్న భారతీయులు ఇండియన్  సోషల్ క్లబ్ ఆద్వర్యంలో 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. లూలూ హైపర్‌మార్కెట్ రెండవ అంతస్తులో సాయంత్రం 06:30 గంటలకు జరిగిన ఈ కార్యక్రమానికి ఒమన్ కు చెందిన షురా కౌన్సిల్ సభ్యుడు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఇండియన్ కమ్యూనిటీ ఉత్సాహంగా పాల్గొన్న ఈ ఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను 'మన గల్ఫ్ న్యూస్' ద్వారా తెలుసుకుందాం.

https://www.managulfnews.com/
Indian Social Club sohar 79th Independence Day celebrations

సోహార్‌లో 79వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలుసోహార్‌లోని ఇండియన్  సోషల్ క్లబ్ ప్రతీ ఏటా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ, భారతీయుల ఐక్యతను, సంస్కృతిని ప్రదర్శిస్తోంది. ఈసారి 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సోహార్‌లోని లులు హైపర్‌మార్కెట్ రెండవ అంతస్తులో ఇండియన్ సోషల్ క్లబ్, సోహార్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. 
సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. చీఫ్ గెస్ట్‌గా హాజరైన మజ్లిస్ అల్ షురా సోహార్ ప్రతినిధి, హెచ్.ఇ. అబ్దుల్లా బిన్ అలీ అల్ బలూషి స్వాగత ఉపన్యాసంలో భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ  శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇండియన్ సోషల్ క్లబ్ సోహర్ యొక్క కమ్యూనిటీ సేవలను ప్రశంసించారు.
కార్యక్రమంలో హైలైట్స్
అనంతరం ఇండియన్ సోషల్ క్లబ్ ప్రెసిడెంట్ కొండల రాజేష్ చీఫ్ గెస్ట్‌తో కలిసి కేక్ కట్ చేశారు, ఇది కార్యక్రమానికి పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. పిల్లలు తమ డాన్స్ పెర్ఫార్మెన్స్‌లతో అందరినీ అలరించారు.
పిల్లల నృత్యాలు, దేశభక్తి గీతాలు, సంప్రదాయ ఆటపాటలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు కార్యక్రమానికి మరింత అందాన్ని తెచ్చాయి. కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు, పెద్దలకు బహుమతులు అందజేసారు. కార్యక్రమంలో సోహార్ లో ఉంటున్న భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇండియన్ సోషల్ క్లబ్, సోహార్ గురించి
ఇండియన్ సోషల్ క్లబ్, సోహార్ ఎల్లప్పుడూ ఇక్కడి భారతీయుల సంక్షేమం కోసం పాటుపడుతుంది. 1977లో స్థాపించబడిన ఇండియన్ సోషల్ క్లబ్, సోహార్, ఒమన్‌లోని భారతీయ కమ్యూనిటీకి ఒక ముఖ్యమైన వేదిక. సాంస్కృతిక, స్పోర్ట్స్, సోషల్ యాక్టివిటీస్ ద్వారా భారతీయులకు అండగా నిలుస్తుంది. 
సంవత్సరం పొడవునా ఇండియన్ సోషల్ క్లబ్ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, విదేశాల్లో ఉన్న భారతీయుల సంక్షేమానికి తోడ్పడుతోంది.

ఈ క్లబ్ కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా, ఒక కమ్యూనిటీగా భారతీయులను ఏకం చేసి, వారికి అవసరమైనప్పుడు ఒక పెద్ద దిక్కుగా అండగా నిలుస్తుంది. సోహార్ లోని భారతీయులందరికీ ఇండియన్ సోషల్ క్లబ్, సోహార్ ఒక భరోసా. ఈ సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ, భవిష్యత్తులోనూ మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందని ఆశిద్దాం.
సోషల్ మీడియా ట్రెండ్స్
సోషల్ మీడియాలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు ట్రెండింగ్‌గా ఉన్నాయి. గల్ఫ్ ప్రాంతంలో భారతీయ కమ్యూనిటీ ఈ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. లులు హైపర్‌మార్కెట్ వంటి వేదికలు ఇలాంటి కార్యక్రమాలకు అనువైన స్థలంగా మారాయి.

మన గల్ఫ్ న్యూస్ ఫాలో చేయండి
మన గల్ఫ్ న్యూస్ తాజా అప్డేట్స్ మరియు గల్ఫ్ జాబ్స్ కోసం మా సోషల్ మీడియా వేదికల్ని ఫాలో చేయండి! ప్రతి రోజు తాజా సమాచారం, గల్ఫ్ న్యూస్, ఉద్యోగ అవకాశాలు మరియు మరెన్నో మీ ముంగిట! మీ కెరీర్‌లో కొత్త అధ్యాయాలు ప్రారంభించడానికి, గల్ఫ్ ప్రాంతంలోని ముఖ్యమైన వార్తలను తెలుసుకోవడానికి మమ్మల్ని ఫాలో చేయండి. అలాగే ఈ సమాచారంపై మీ విలువైన అభిప్రాయాన్ని, సలహాలు, సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ విలువైనదిగా భావిస్తే షేర్ చేయండి.

Post a Comment

0 Comments

Subscribe Us మన గల్ఫ్ న్యూస్