ఒమన్, జులై 13, సౌదీఅరేబియా: 12 ఏళ్లు వయసు ఉన్న వారు ఏం చేస్తారు... స్కూల్ కి వెళ్లడం. హోంవర్క్ చేసుకోవడం. ఎగ్జామ్స్ రాయడం మార్కులు తెచ్చుకోవడం.. ఆటలు ఆడడం చేస్తుంటారు. హాలీడేస్ వస్తే స్నేహితులతో గడపడం.. ఇదంతా రోటీన్. అందరూ చేసే పని. కానీ, ఒక అమ్మాయి మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించింది. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాకు చెందిన 7వ తరగతి విద్యార్ధిని మాన జంపాల మాత్రం ఏకంగా మూడు దేశాల్లో విస్తరించిన ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ కంపెనీని నడుపుతోంది. ఎవరు ఆమె.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఆ వండర్ సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం..
![]() |
| mana-jampala-ceo-ai |
Who is mana jampala: ఎవరీ మాన జంపాల
మానా జంపాల కుటుంబం బ్రిటిష్ కొలంబియాలోని కెలోనా (Kelowna)లో నివాసం ఉంటోంది. వారికి భారతీయ మూలాలు ఉన్నట్టు తెలుస్తోంది. మానా జంపాల మాత్రం కెనడాలో పుట్టి పెరిగింది. 7వ తరగతి చదువుతోంది. తన 9 ఏళ్ల వయసు నుంచే ఈ బాలిక ఏఐపై ఆసక్తి పెంచుకుంది. దాంతో స్క్రాచ్ (Scratch) కోడింగ్ నేర్చుకుంది. దానికి సంబంధించిన కంటెస్టెంట్ లో పాల్గొనేంది. ఫైథాన్ కూడా నేర్చుకుంది. ప్రస్తుతం ఆమె చదువుకుంటూనే కోడింగ్, సైన్స్ పోటీలపై దృష్టి సారించింది.
11 ఏళ్ల వయసు వచ్చేసరికి జంపాల సొంతంగా ఏఐ ప్రొడక్ట్స్ ను తయారు చేయడం ప్రారంభింభించింది. ఆమె ప్రతిభకు స్కూల్ దాటి గుర్తింపు వచ్చింది. ఇండియా పర్యటనలో ఉన్నప్పుడు ఒక కాలేజీ స్థాయి సైన్స్ పోటీలో ప్రత్యేక బహుమతి గెలుచుకుంది. అలాగే, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే ‘1517 ఫండ్’కు చెందిన మెడిసి ప్రాజెక్ట్ నుంచి గ్రాంట్ కూడా అందుకుంది. ఇంత పెద్ద కంపెనీని రన్ చేస్తున్నప్పటికీ.. మానాకు ఫుట్ బాల్ ఆడటం, ఫ్రెండ్స్ తో గడపడం, తనలాంటి ఇతర యువ బిల్డర్లను కలవడం అంటే చాలా ఇష్టం.
Whats work on mana: అసలు ఆమె ఏం చేసింది
మానా జంపాల తండ్రి చిన్నపాటి వ్యాపారం నిర్వహిస్తుండే వారు. తక్కువ మంది సిబ్బంది ఉండటంతో కస్టమర్ల నుంచి వచ్చే కాల్స్ స్వీకరణ, నిర్వహణలో ఇబ్బంది ఉన్నట్టు మానా గుర్తించింది. దానికి పరిష్కారం కొనుగొనాలని ఆలోచించింది. పట్టుబడింది. అందులో నుంచి వచ్చిందే ఒక ఏఐ ఆధారిత రిసెప్షనిస్ట్ వోగ్జా(Voxa)ను డెవలప్ చేసింది. దీనిని 2025 నవంబర్ లో అభివృద్ధి చేసింది. ఈ చిన్న సాఫ్ట్ వేరే ఇప్పుడు తన కుటుంబం నిర్వహించే చిన్న వ్యాపారాల్లో 24/7 కస్టమర్ కాల్స్ మేనేజ్ చేయడంలో సహాయపడుతున్నది. అందుకోసం.. చాట్ జీపీటీ, క్లాడ్ సాయం తీసుకున్నట్టు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
What is Voxa: ఇంతకు వోగ్జా ఏం చేస్తుంది
ముఖ్యంగా వోగ్జా అనే ఏఐ రిసెప్షనిస్ట్ కస్టమర్ల కాల్స్ (Custemer calls)కు సమాధానం ఇవ్వడం, అపాయింట్ మెంట్ బుక్ చేయడం (Appointment book), రెస్టారెంట్ ఆర్డర్లు (Restarent) నమోదు చేయడం, మిస్డ్ కాల్స్ నిర్వహణ (Missedcall), కాల్ సమరీలు (call summery) ఇవ్వడం వంటి పనులు చేసి పెడుతోంది. దీంతో మానా జంపాలాల వోగ్జా ఏజెంట్స్ పేరుతో ఒక ఏఐ స్టార్టప్ ను కూడా ప్రారంభించి నడుపుతోంది. దీనిని ఏకంగా మూడు దేశాల్లో విస్తరించింది. ఆమె లిక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ఈ ప్లాట్ ఫామ్ ఇప్పటికే కెనడా, భారతదేశం, కాంబోడియా దేశాల్లో విస్తరించి విజయవంతం అయింది. అంతేనా.. గ్లోబల్ లెవెల్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అత్యంత పిన్న వయస్కురాలైన ఏఐ ఫౌండర్లలో మాన ఒకరిగా నిలిచింది.
Mana Next target: మానా నెక్ట్స్ టార్గెట్..
కేవలం ఏఐ రిసెప్షనిస్ట్ తోనే మానా ఆగిపోవడం లేదు. ఆమె తన తదుపరి అడుగుగా వోక్సా ఏజెంట్స్ (Voxa Agents) అనే కొత్త వెంచర్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు తమకు కావాల్సిన పనిని సాధారణ ఇంగ్లీషులో వివరిస్తే చాలు.. స్వయంప్రతిపత్తి కలిగిన (Autonomous) ఏఐ ఏజెంట్లు ఆ పనిని ఆటోమేటిక్ గా పూర్తి చేస్తాయి. మీటింగ్ బ్రీఫింగ్స్ సిద్ధం చేయడం లేదా ఆన్ లైన్ సంభాషణలను పర్యవేక్షించడం వంటి పనులను ఇవి సులువుగా చేసేలా రూపొందిస్తోంది. ఇక, భవిష్యత్ లో ఈ కంపెనీని మరింత విస్తరించి, ఒక ప్రముఖ స్టార్టప్ యాక్సిలరేటర్ లో చేరాలని మాన లక్ష్యంగా పెట్టుకుంది. చాలా మంది విద్యార్థులు తమ కెరీర్ గురించి ఆలోచించడం కూడా మొదలుపెట్టని వయసులోనే, మాన జంపాల ఖండంతరాల వ్యాప్తంగా బిజినెస్ లకు ఉపయోగపడే ప్రొడక్ట్స్ తయారు చేస్తూ, రాబోయే తరం ఏఐ విప్లవాన్ని ఎంత వేగంగా అందుకోబోతుందో ప్రపంచానికి చాటి చెప్పింది.
Key word
mana Jampala, Built AI, Startup company, 3 countries startup, 12 year old mana Jampala, Canada, India, Cambodia, Grade 7th class, automate customer calls, small business, created tools, jampala mana, Youngest AI founders, managulfnews, managulfnews in telugu, మన గల్ఫ్ న్యూస్, మన గల్ఫ్ న్యూస్ తెలుగు వార్తలు, మన గల్ఫ్ న్యూస్ జాబ్స్, గల్ఫ్ సమాచారం తెలుగులో

0 కామెంట్‌లు